బాలానగర్, సెప్టెంబర్ 7 : ఎస్బీఐ పర్సనల్ లోన్ కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తి రూ.20,234 పోగొట్టుకున్న సంఘటన బాలానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ వహీదుద్దిన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరాగాంధీనగర్‌కు చెందిన వెంకటేశ్వర్ ఈ నెల 1న ఎస్బీఐ పర్సనల్ లోన్ తీసుకునేందుకు కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు. అందులోని నంబర్‌కు ఫోన్ చేయగా పర్సనల్ లోన్ కావాలంటే ఫోన్లో ఎనీడెస్క్ డౌన్‌లోన్ చేయాలని సైబర్‌నేరగాళ్లు సూచించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు ఎనీడెస్క్ డౌన్లోడ్ చేయగా అతడి క్రెడిట్ కార్డులో నుంచి రూ.20,234 డెబిట్ అయ్యాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు బాలానగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.