మలక్‌పేట అంతా ‘బలాల’ బలగమే
మలక్‌పేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఆశీర్వదించిన ఓటర్లందరికీ ఆయన ఆదివారం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- మలక్‌పేటలో నాలుగోసారి విజయం సాధించిన బలాల
- ఓటర్లందరికీ రుణపడి ఉంటానన్న ఎంఐఎం అభ్యర్థి
సైదాబాద్, డిసెంబర్ 3 : మలక్‌పేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఆశీర్వదించిన ఓటర్లందరికీ ఆయన ఆదివారం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి షేక్ అక్బర్‌పై 26,093 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన సందర్భంగా పలువురు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి రౌండ్లో కనీస అధిపత్యాన్ని కొనసాగిస్తూ చివరి వరకు వచ్చిన బలాల నిర్ధిష్టమైన భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్ని తప్పకుండా అమలుచేసేందుకు కృషి చేస్తానని, పాతబస్తీలోని మలక్‌పేటను ఐటీ హబ్‌గా తీర్చిదిద్ది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటమే తన ప్రధాన లక్ష్యమన్నారు.
ఎమ్మెల్యే బలాల ప్రొఫైల్ :
పేరు : అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల
తండ్రి పేరు : అబ్దుల్లా బిన్ అహ్మద్ బలాల
పుట్టిన తేది : 22-10-1967
చిరునామా : కుచె నసీం మచిలీకమాన్, పత్తర్‌ఘట్టి, హైదరాబాద్
విద్యార్హత : పదో తరగతి
రాజకీయ ప్రవేశం : 2002లో పత్తర్‌ఘట్టి డివిజన్ నుంచి ఎంఐఎం పార్టీ తరుపున పోటీ చేసి కార్పొరేటర్‌గా విజయం సాధించారు.
చరిత్రను తిరగరాసిన బలాల బలగం…
మలక్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి వరుస విజయా లతో అహ్మద్ బలాల చరిత్రను తిరగ రాస్తున్నారు. నాలుగోసారి విజయం సాధించి మలక్‌పేట నియోజకవర్గంలో తన బలగం ఎంతో ఉందో మరోసారి నిరూపించారు. ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ జరిగినప్పటికీ మైనార్టీయేతర ఓట్లతో సంబంధం లేకుం డా విజయం సాధించిన ఎమ్మెల్యే బలాల హిందువుల ఓట్లను పొందడంలో చాలావరకు విజయవంతమ య్యారు. నియోజకవ ర్గం పరిధిలోని తన బలగం చాల ఉందని మరోసారి విజయం సాధించి నిరూపించారు.
మలక్‌పేటలో భారీ విజయోత్సవ ర్యాలీ..
మలక్‌పేట ఎమ్మెల్యేగా అహ్మద్ బలాల భారీ విజయం సాధించటంతో మలక్‌పేట నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అంబర్‌పేట డీఆర్సీ సెంటర్ వద్దకు పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలిరావటంతో ఫలితం వెలుబడిన వెంటనే అక్కడి నుంచి పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు పుష్పగుచ్చాలతో, పూల మాలలతో అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ఐటీ టవర్.. నా డ్రీమ్ : బలాల
నగరంలో అన్ని రంగాల్లో వెనుకబడిన పాతబస్తీ అభివృద్ధి ఐటీ టవర్‌తోనే సాధ్యమని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల పేర్కొన్నారు. పాతబస్తీ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించటమే తన లక్ష్యమన్నారు. వెయ్యి కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఐటీ టవర్ సకాలంలో పూర్తిచేసి వేలాది మంది యువతకు ఉద్యోగాలను కల్పిస్తాను. నగరంలోనే మలక్ పేటను ఆదర్శమైన అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

