Kukatpally | మూసాపేట, నవంబర్ 27: తన వదిన, సిస్టర్‌పై అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై నలుగురు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ ముత్తు విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. చెన్నబోయిన పవన్(22) ప్రైవేట్ జాబ్, చెన్నబోయిన శ్రీధర్(20) ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా పని చేస్తున్నారు. వీరిద్దరూ అన్నదమ్ములు. వీరు కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. ఈనెల 22న రాత్రి 11 గంటల సమయంలో తన సిస్టర్, వదినతో కలిసి కూకట్‌పల్లిలోని దుర్గ టిఫిన్ సెంటర్లో సమోస తినడానికి వెళ్లారు.
అదే సమయంలో కూకట్పల్లి శ్రీరామ టవర్స్‌లో నివాసం ఉంటున్న జి.వెంకటరమణ(22) మద్యంమత్తులో తన స్నేహితులతో కలిసి టిఫిన్ సెంటర్ వద్ద ఉన్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో పవన్ వెంకటరమణకు మధ్య గొడవ జరిగింది. దీంతో శ్రీధర్ మరో ఇద్దరు స్నేహితులైన బి.సురేశ్(19) జి.అజయ్‌కుమార్(20)లను ఫోన్ చేసి పిలిపించాడు. నలుగురు వెంకటరమణపై దాడి చేసి కర్రతో తలపై కొట్టారు. అయితే వెంకటరమణ వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో వెంకటరమణ బ్రెన్ డెడ్‌తో చికిత్స పొందుతూ ఈనెల 23న మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి సీఐ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పవన్, శ్రీధర్, సురేశ్, అజయ్కుమార్లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.