కొండాపూర్, జూన్ 2 : హైదరాబాద్ చందా నగర్ డివిజన్ పరిధిలోని తారానగర్ స్మశాన వాటికలో షెడ్డు నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. తారా నగర్ లోని హిందూ స్మశాన వాటికలోనీ దింపుడు కల్లం ప్రాంతంలో నిర్వహించే సంప్రదాయ కార్యక్రమాలకు షెడ్డు లేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్న స్థానికులు కొండ విజయ్ , మారం వెంకట్, రెడ్డి ప్రవీణ్ రెడ్డి లు రూ 1,20,000 లక్షలతో షెడ్డు నిర్మాణానికి ముందుకు రావడం జరిగింది. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని దాతలు అన్నారు.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ నాయకులు రెడ్డి రఘునాథ్ రెడ్డి, ఓర్సు వేంకటేశ్వర్లు, నరేందర్ భల్లా శాంతి భూషణ్ రెడ్డి, మల్లేశ్ యాదవ్, సందీప్ గుప్తా, శేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి , రవీందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు .
s