సిటీబ్యూరో/ బేగంపేట, జనవరి 18 (నమస్తే తెలంగాణ ) : సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 220 సంవత్సరాల గణ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
17న శాంతి ర్యాలీ కోసం ఈ నెల 5న దరఖాస్తు చేస్తే ర్యాలీ చేసుకొమ్మని చెప్పిన పోలీసు అధికారులు ఉద్దేశ పూర్వకంగా ర్యాలీకి కొద్ది గంటల ముందు అర్ధరాత్రి ర్యాలీకి అనుమతి లేదని వాట్సాప్‌లో సమాచారం పంపించడం అన్యాయమని తలసాని పేర్కొన్నారు. ర్యాలీ జరగకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎకడికకడ అరెస్ట్‌లు, నిర్బంధాలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. ఒక భయానక వాతావరణం కల్పించారని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, అన్ని వర్గాల ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో హాజరయ్యారని, వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
అరెస్ట్ చేసిన వారిని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించి విడుదల చేసే విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని తలసాని మండిపడ్డారు. ఫిబ్రవరి మొదటి వారంలో రెట్టింపు ఉత్సాహంతో భారీ ర్యాలీ నిర్వహించుకుందామని, న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకుంటామని తలసాని తెలిపారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకుంటే సికింద్రాబాద్ బంద్‌కు కూడా పిలుపునిస్తామని తలసాని హెచ్చరించారు. ఎంతో ప్రశాంతంగా ఉండే నార్త్ జోన్లో వివిధ వర్గాలు, వివిధ ప్రాంతాలు, వివిధ భాషలకు చెందిన ప్రజలు కలిసిమెలసి ఉంటారని, వీరి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదని చెప్పారు.
సికింద్రాబాద్ జీహెచ్ఎంసీలోనే ఉందని చెప్పే ముఖ్యమంత్రి..నార్త్ జోన్‌లోని పోలీస్ సరిల్స్, జీహెచ్ఎంసీ సరిల్స్, డివిజన్లను మలాజిగిరి జోన్లో ఎలా కలిపారని ప్రశ్నించారు. అనంతరం నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, సీనియర్ సిటీజన్స్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సన్మానించి అభినందనలు తెలిపారు. లషర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, కార్పొరేటరు మహేశ్వరి, శైలజ, ప్రసన్న, సునీత, మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ నగేశ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, బాల్ రెడ్డి, హరికృష్ణ, హన్మంతరావు, నాయకులు పాల్గొన్నారు.