మేడ్చల్ రూరల్, డిసెంబర్ 26: ప్రజా క్షేమం కోసం యజ్ఞాలు చేయడం శుభ పరిణామమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మేడ్చల్ మండ లం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ శివారులోని సాయిగీతాశ్రమంలో ఈ నెల 31న నిర్వహించే సర్వదోష నివారణ మహాయజ్ఞంలో భాగంగా మంగళవారం శ్రీ చండీ హోమం నిర్వహించారు.
హోమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రొళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, నాయకుడు గాలి అనిల్ కుమార్‌తో కలిసి మాజీ మంత్రి హోమంలో పాల్గొన్నారు. అనంతరం సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ నిస్వార్థంతో చేపట్టే యజ్ఞంతో లోక కళ్యాణం జరుగుతుందని, ప్రజలు పాల్గొనాలని కోరారు. హోమంలో ఆశ్రమ మేనేజర్ శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.