చాదర్ఘాట్, జూలై 18: మహారాష్ట్రకు చెందిన మాజీ కార్పొరేటర్ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ నవగేరే హోంమంత్రి మహమూద్ అలీని మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రశాంత్ నవగేరే మాట్లాడుతూ.. వేలాది మంది బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు. దేశానికి కేసీఆర్ లాంటి మహానేత ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువత నేత ఫర్కాన్ అహ్మద్, మలక్పేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లాయక్ లీ, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.