మూసాపేట, జూలై 28: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోదరుడి వేధింపులకు ఓ వ్యక్తి బలయ్యాడు. ఆర్థిక లావాదేవిల్లో అవకతవకలకు పాల్పడ్డావంటూ ఆరోపిస్తూ కారు లాక్కోని, దాడికి పాల్పడడంతో మనస్తాపానికి గురైన అతను ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం..
కూకట్పల్లి పరిధి, వెంకట్రావ్నగర్కు చెందిన అంకెనపల్లి కుమార్(28).. కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ సోదరుడు కూన శ్రీనివాస్‌గౌడ్‌కు సంబంధించిన బాచుపల్లిలోని సమక్క, సారక్క క్రషర్లో క్యాషియర్‌గా గత 8 ఏండ్లుగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య మౌనిక, 28రోజుల పాప ఉన్నా రు. అయితే.. క్రషర్లో జరిగిన ఆర్థిక లావాదేవిల్లో అవకతవకలకు కారణం అంటూ గత వారం రోజులుగా కుమార్‌ను వేధిస్తున్నారు.
ఈ క్రమంలో శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం కుమార్‌ను తన కార్యాలయానికి రప్పించి.. సెల్‌ఫోన్, కా రును లాక్కోవడమే కాకుండా సిబ్బందితో దాడి చేయించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కుమార్ ఆదివారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో శ్రీనివాస్‌గౌడ్ వేధింపులతోనే కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి భార్య, కు టుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు మృతదే హంతో ధర్నాకు దిగారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.