
రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులకు అండగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపట్టారు. సోమవారం టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మీర్‌పేట, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్, తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీల్లో, ఆర్కేపురం, సరూర్‌నగర్, కందుకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో, మహేశ్వరం మండలంలోని వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, బైక్ ర్యాలీలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. వడ్ల కొనుగోలుపై స్పష్టతనివ్వాలని, రైతు ప్రయోజనాలను దెబ్బ తీస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. కందుకూరులో నిర్వహించిన ధర్నాలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పిలుపుతో..
బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి ఆధ్వర్యంలో మల్లాపూర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చేతులెత్తేసిన కేంద్రం..
ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని షాహీన్‌నగర్‌లో సోమవారం టీఆర్ఎస్ కౌన్సిలర్లు మజర్ అలీ, శంషుద్దీన్, లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, నాయకులు ఇక్బాల్ బిన్. ఖలీఫా, యూసుఫ్ పటేల్, ఖైసర్బామ్, వాసుబాబు, నిరంజన్, మహబూబ్ హసన్ తదితరులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మలను దహనం చేశారు.
కొనుగోలు చేయాల్సిందే..
తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేఖ చర్యలకు నిరసనగా సోమవారం ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్ ఆధ్వర్యంలో ఆర్కేపురం చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నగేశ్, మాజీ డివిజన్ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్‌శర్మ, నాయకులు బీరెల్లి వెంకట్‌రెడ్డి, మారోజు రామాచారి, గొడుగు శ్రీనివాస్, సాజీద్, కొండ్ర శ్రీనివాస్, లింగస్వామిగౌడ్, భూపాల్‌రెడ్డి, దుబ్బాక శేఖర్, ఫరీద్ పాషా, పెంబర్తి శ్రీనివాస్, సిద్దగోని వెంకటేశ్ గౌడ్, పటేల్ సునీతారెడ్డి, లిక్కి ఊర్మిలారెడ్డి, పి.ఎల్లయ్య, యాదవరెడ్డి, పబ్బు శ్రీనివాస్, కంచర్ల శేఖర్, చామల శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం
నల్ల బ్యాడ్జీలతో నిరసన..
మీర్‌పేట చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు వ్యతిరే విధానాలకు నిరసనంగా ధర్నా చేశారు. ప్లకార్డులు పట్టుకొని, మూతులకు నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో మీర్‌పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు సిద్దాల లావణ్య బీరప్ప, అక్కి మాదవి, బాలమణి, టీఆర్ఎస్ నాయకులు పల్లె పాండు గౌడ్, బండి నాగేశ్ ఉన్నారు.
నిర్లక్ష్యవైఖరికి నిరసనగా..
రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సరూర్‌నగర్ డివిజన్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, డివిజన్ మాజీ అధ్యక్షుడు అంకిరెడ్డి, నాయకులు దయాకర్‌రెడ్డి, సుదర్శన్, నర్సింహాగౌడ్, రాఘవేంద్రగుప్తా, సలీం, బాల్‌రాజ్, నరేశ్‌గౌడ్, జంగారెడ్డి, యశ్వంత్, కట్ట ప్రవీణ్, సతీశ్, మహేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రమే కొనుగోలు చేయాలి..
తెలంగాణలో పండించిన వరిధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ కాంటెకార్ మధుమోహన్ అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ పిలుపుమేరకు తుక్కుగూడ హైవేపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షుడు జిల్లెల లక్ష్మయ్య, మున్సిపాలిటీ మహిళా అధ్యక్షురాలు ఎళ్లగొండ పద్మాభాస్కర్రెడ్డి, యువజన నాయకులు సామ్యల్రాజు, కౌన్సిలర్లు లావణ్యరాజు, తేజస్విని శ్రీకాంత్‌గౌడ్, సుమన్, రవినాయక్, నాయకులు శ్రీనివాస్, సురేశ్, రత్నం, మల్లేశ్, శేఖర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, శ్రీశైలం పాల్గొన్నారు.