మణికొండ : అనారోగ్యంతో భాధపడుతున్న పేదలకు ఆపన్నహస్తంగా ఎల్ఓసీ ద్వారా చేయూతనందిస్తున్నామని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్‌గౌడ్ పేర్కొన్నారు. నార్సింగి గ్రామానికి చెందిన యాదయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో భాధపడుతుండగా ఆయన శస్త్ర చికిత్సకు అత్యవసరమైన రూ.1.50వేల చెక్కును ప్రభుత్వం మంజూరుచేసింది.
ఈ సందర్బంగా భాధిత కుటుంబసభ్యులకు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ రేఖయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేష్యాదవ్ల సమక్షంలో అందజేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటుందని ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహ్మ, నాయకులు పాల్గొన్నారు.