హోటల్ భోజనం.. అనారోగ్యానికి ఆహ్వానం!
సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ)హోటల్‌కు వెళ్లినా, రెస్టారెంట్లో భోజనం చేసినా, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం లభిస్తుందనే నమ్మకంతోనే ప్రజలు డబ్బులు చెల్లిస్తున్నారు.
- కుళ్లిన మాంసం, గడువు తీరిన ఆహార పదార్థాలు
- పురుగులు, ఎలుకలకు ఆవాసాలుగా వంటశాలలు
- టీజీ-సేఫ్ దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు
- ప్రజారోగ్యానికి పొంచి ఉన్న ముప్పు
సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ)హోటల్‌కు వెళ్లినా, రెస్టారెంట్లో భోజనం చేసినా, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చినా నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం లభిస్తుందనే నమ్మకంతోనే ప్రజలు డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే తెలంగాణరాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై టీజీ-సేఫ్ (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) అధికారులు చేపడుతున్న తనిఖీలు, దాడుల్లో వెలుగుచూస్తున్న పరిస్థితులు ఆ నమ్మకాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పేరుగాంచిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, క్లౌడ్ కిచెన్లలో కుళ్లిపోయిన కూరగాయలు, ఫంగస్ పట్టిన పదార్థాలు, గడువు ముగిసిన ఆహార వస్తువులు, బొద్దింకలు, ఎలుకల వ్యర్థాలు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం ఆహార నాణ్యతకు సంబంధించిన సమస్య కాదు. ప్రజల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తు, వృద్ధుల ప్రాణాలు, ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థపై అదనపు భారం వంటి అనేక అంశాలతో ముడిపడిన తీవ్రమైన సమస్య.
హోటళ్లలో తయారయ్యే పూరీలు, బజ్జీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రై, ఇతర డీప్ ఫ్రై వంటకాలకు నూనె కీలకం. అయితే ఒకసారి ఉపయోగించిన నూనెను పదేపదే అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసి వినియోగించడం ఆరోగ్యానికి హానికరం. నూనెను పదేపదే వేడి చేసినప్పుడు అందులో రసాయన మార్పులు చోటుచేసుకుని హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి. వీటిని దీర్ఘకాలం తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, జీవక్రియ సంబంధిత అనారోగ్యాల ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది. ఇటీవల కరీంనగర్‌లోని కేఎఫ్‌సీ అవుట్లెట్ తనిఖీల్లో ఉపయోగించిన వంటనూనెలో ‘టోటల్ పోలర్ కాంపౌండ్స్’ (టీపీసీ) స్థాయులు 31, 35.5 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఈ టీపీసీ అనేది 25 శాతానికి మించి ఉండకూడదు. కాని కేఎఫ్‌సీ అవుట్లెట్లలో 30శాతానికి పైగా ఉండటంతో సుమారు 90 లీటర్ల నూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని హోటళ్లలో ఉపయోగించిన నూనెను మెగ్నీషియం సిలికేట్ వంటి పదార్థాలతో వడపోసి మళ్లీ వినియోగించే విధానం బయటపడటం మరింత ఆందోళనకరం. నూనెను వడపోసినంత మాత్రాన అది తిరిగి సురక్షితమైనదిగా మారదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గడువు ముగిసిన ఆహార పదార్థాలతో…
హోటళ్లు, రెస్టారెంట్లలో లాభాల కోసం ఆహార వ్యర్థాలను తగ్గించాలనే ఉద్దేశంతో కొందరు నిర్వాహకులు మిగిలిపోయిన ఆహారాన్ని తిరిగి వినియోగిస్తున్నారనే ఆరోపణలకు తనిఖీల్లో బయటపడుతున్న నిల్వలు అద్దం పడుతున్నాయి. వండిన ఆహారాన్ని ఎకువసేపు సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం, సరైన పద్ధతిలో చల్లబరచకపోవడం, మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల సూక్ష్మజీవులు పెరిగే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మాంసాహార వంటకాలు, చికెన్, చేపలు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు సురక్షితమైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందవచ్చు. ‘సాల్మొనెలా’్ల, ‘ఈ.కోలి’, ‘లిస్టీరియా’ వంటి సూక్ష్మజీవుల వల్ల ఆహార పదార్థాలు విషతుల్యంగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. దీని ఫలితంగా వాంతులు, విరేచనాలు, కడుపువొప్పి, జ్వరం, తీవ్రమైన డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తవచ్చని, ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తకువగా ఉన్నవారిలో పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రముఖ బ్రాండ్ల హోటళ్లలోనూ ఇదే పరిస్థితి..!
సాధారణ హోటళ్లలోనే కాకుండా ప్రముఖ ఫుడ్ చైన్లు, స్వీట్ తయారీ సంస్థల్లోనూ ఆహార భద్రతా ఉల్లంఘనలు వెలుగులోకి రావడం గమనార్హం. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బ్రాండ్ పేరు, ఖరీదైన మెనూ, ఆధునిక ఇంటీరియర్ ఉన్నంత మాత్రాన ఆహారం సురక్షితమని భావించలేమని తాజా తనిఖీలు నిరూపిస్తున్నాయి. నవంబర్ 5న తెలంగాణ హైకోర్టు జి. పుల్లారెడ్డి స్వీట్స్‌కు చెందిన సనత్‌నగర్ తయారీ కేంద్రం లైసెన్స్ పునరుద్ధరణకు తక్షణ ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించడమే ఇందుకు నిదర్శనం. అంతకుముందు తనిఖీల్లో కుళ్లిన కూరగాయలు, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన ఉత్పత్తులు, అపరిశుభ్రమైన తయారీ ప్రాంతాలు బయటపడినట్లు నివేదికలు వెల్లడించాయి. అధికారులు సుమారు రూ.15.03లక్షల విలువైన 3,133 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
హైకోర్టు ఆదేశాతో రాష్ట్రవ్యాప్త తనిఖీలు
ఆహార భద్రత విషయంలో తెలంగాణ హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. నవంబర్ 7న వెలువడిన ఆదేశాల్లో రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, మాంసం, చేపల విక్రయ కేంద్రాలు, సూపర్ మారెట్లు, వీధి ఆహార విక్రయ కేంద్రాల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించాలని అధికారులకు న్యాయస్థానం సూచించింది. చెల్లుబాటు అయ్యే లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న ఆహార వ్యాపార సంస్థలను గుర్తించాలని, కల్తీ, గడువు ముగిసిన, కలుషిత ఆహార పదార్థాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రజల ఫిర్యాదులను స్వీకరించి పరిషరించేందుకు సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. ఎనిమిది వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

టీజీ సేఫ్ దాడుల్లో దిగ్భ్రాంతికర వాస్తవాలు
- నవంబర్ 1న హైదరాబాద్‌లోని గోలొండ, చార్మినార్ జోన్లలో 22 ఆహార సంస్థలను తనిఖీ చేయగా, 14 సంస్థల లైసెన్సులు నిలిపివేశారు. ఈ తనిఖీలలో సుమారు 544 కిలోల కలుషిత, కుళ్లిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. బొద్దింకలు, ఈగలు, ఎలుకల వ్యర్థాలు, ఫంగస్ పట్టిన కూరగాయలు, గడువు ముగిసిన పదార్థాలు, అపరిశుభ్రమైన వంటశాలల దుస్థితి బట్టబయలైంది.
- నవంబర్ 10న క్యూర్ పరిధిలోని 23 క్లౌడ్ కిచెన్లు, రెస్టారెంట్లను తనిఖీ చేయగా ఆహార భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించని 8సంస్థల లైసెన్సులు నిలిపివేశారు. 25 ఆహార నమూనాలు సేకరించి, సుమారు 700 కిలోల కలుషిత ఆహారాన్ని పారవేశారు. బిర్యానీ, ఇతర వంటకాల తయారీలో ఉపయోగించే పదార్థాలు సరిగా నిల్వ చేయకపోవడం, పురుగుల సమస్య, గడువు ముగిసిన ఆహారం వంటి లోపాలు గుర్తించారు.
- నవంబర్ 12న కేఎఫ్‌సీ, డొమినోస్‌కు చెందిన హైదరాబాద్‌లోని 26 అవుట్ లెట్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా, తొమ్మిది అవుట్ లెట్ల లైసెన్సులు నిలిపివేశారు. కొన్ని చోట్ల బొద్దింకలు, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన పదార్థాలు, వాడిన వంటనూనెను అక్రమంగా శుద్ధిచేసి తిరిగి వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 52 కిలోల సింథటిక్ మెగ్నీషియం సిలికేట్‌ను స్వాధీనం చేసుకుని, 20 ఆహార నమూనాలను సేకరించారు. ఈ పరిణామాలు ఒకరోజులో బయటపడినవి కావు. అక్టోబర్ 31న జరిగిన తనిఖీల నుంచి నవంబర్ 13 వరకు వెలుగులోకి వచ్చిన వరుస ఘటనలు హోటళ్లు, కౌడ్ కిచెన్లలో నెలకొన్న దుర్భర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
కుళ్లిన ఆహారం..పురుగుల మధ్యే వంటలు!
హోటళ్లలో ఆహారం తయారుచేసే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. ముడి పదార్థాలు, తయారైన ఆహారం వేర్వేరుగా నిల్వ చేయాలి. మాంసం, చేపలు, పాల ఉత్పత్తులను నిర్దేశిత ఉష్ణోగ్రతల్లో భద్రపరచాలి. కానీ తనిఖీల్లో బయటపడుతున్న దృశ్యాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి.
- కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లు రోజుల తరబడి నిల్వ చేయడం
- పప్పులు, పిండి పదార్థాల్లో పురుగులు, ఫంగస్ ఉండటం.
- ఫ్రిజ్‌లు, చిల్లర్ గదుల్లో అపరిశుభ్రత, నీటి లీకేజీలు.
- వండిన ఆహారాన్ని మూతలు లేకుండా నిల్వ చేయడం.
- పచ్చి మాంసం, వండిన ఆహారాన్ని ఒకేచోట ఉంచడం.
- వంట పాత్రలు, పరికరాలపై జిడ్డు, తుప్పు పేరుకుపోవడం.
- వంటశాలల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకల సంచారం.
- గడువు ముగిసిన ఆహార పదార్థాలను వినియోగించడం.
- మరికొన్ని ప్రాంతాల్లో ఆహార పదార్థాలను వార్తాపత్రికలతో కప్పడం, పారిశుద్ధ్యానికి ఉపయోగించే వస్తువుల పకనే వండిన ఆహారాన్ని నిల్వ చేయడం వంటి నిర్లక్ష్యపు విధానాలు కూడా బయటపడ్డాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

