పాత పెన్షన్ కోసం ఉద్యోగుల పోరుబాట
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం మరో భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నది.
- 17న ‘సామూహిక సెలవు’
- ఇప్పటికే 1.5 లక్షలకుపైగా సెలవు దరఖాస్తులిచ్చిన ఉద్యోగులు
- హామీలు అమలు చేసేవరకు పోరాటం: టీఎస్ సీపీఎస్ ఈయూ
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం మరో భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నది. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రకటించి మూడేండ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సామూహిక సెలవు పాటించడంతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో భారీఎత్తున ధర్మదీక్షలు నిర్వహించనున్నారు.
మొత్తం 2.6 లక్షల మంది ఉద్యోగుల్లో 45 వేల మంది అత్యవసర సేవల సిబ్బంది ఉన్నారు. మిగిలినవారిలో ఇప్పటికే 1.5 లక్షలకుపైగా ఉద్యోగులు సెలవు దరఖాస్తులు సమర్పించడం ఉద్యమానికి లభిస్తున్న విశేష స్పందనకు నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ సీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ సీపీఎస్ ఈయూ) రాష్ట్ర కార్యవర్గం అదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సామూహిక సెలవు ఉద్యమానికి ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు(ఎమ్మెల్సీ) శ్రీపాల్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 17న నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగే ధర్మదీక్షలో తాను పాల్గొంటానని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

