Outside Food | సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోమాజిగూడ జల్పాన్ రెస్టారెంట్లో వంటగది అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఫుట్టగొడుగులు, నువ్వుల నూనె, పాల ప్యాకెట్ తదితర ఆహార ప్యాకెట్లు గడువు ముగిసినట్లు తనిఖీలో తేల్చారు.
వంటగది కిటికీకి అమర్చిన మెష్‌లో పావురం రెట్టలు ఉండి దుర్వాసన వెదజల్లుతున్నట్లు నిర్ధారించారు. దీంతో పాటు పంజాగుట్ట మెరిడియన్ రెస్టారెంట్లో వంటగది ప్రాంగణం అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. బిర్యానీ తయారు చేసే ప్రాంతంలో నీరు నిలువడం, ప్రిజ్‌లో ఉన్న వస్తువులకు లేబుల్స్ సరిగా లేవని తేల్చారు. సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకున్నట్లు ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు పేర్కొన్నారు.