సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉస్మాన్‌సాగర్ 2 గేట్లు ఒక అడుగు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా హిమాయత్‌సాగర్ 1 గేటును 3 అడుగులు, ఒక గేటు ఒక అడుగు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్ పూర్తి నీటి మట్టం 1,790 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,789.50 అడుగుల వరకు ఉన్నది.
ఎగువ నుంచి ఇన్‌ఫ్లో 400 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. ఔట్ ఫ్లో 234 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదేవిధంగా హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1,763.05 అడుగుల నీటి మట్టం ఉంది. ఎగువ నుంచి 800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. దిగువకు 1,365 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.