హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న గండిపేట జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు.. వరద పోటెత్తింది. గండిపేట జలాశయం ప్రస్తుత నీటిమట్టం 1789.40 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు. ఇలాగే వరద ఉధృతి కొనసాగితే క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
హిమాయత్ సాగర్ జలాశయానికి కూడా వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1763.35 అడుగులుగా ఉంది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.