సిటీబ్యూరో/అంబర్‌పేట, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ): వెండి వ్యాపారులను టార్గెట్ చేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు అం తర్ర్రాష్ట్ర ముఠా సభ్యులను శనివారం మహంకాళి పోలీ సులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా వెండి వ్యాపారులను పరిచయం చేసుకుని ఒకటిరెండుసార్లు అసలు వెండిని అమ్మి .. ఆ తర్వాత నకిలీ వెండిని చేతిలో పెట్టి లక్షల డబ్బుతో ఉడాయిస్తా రు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితామూర్తి వివరాలు వెల్లడించారు.. సికింద్రాబాద్‌లోని ఆవుల మందకు చెందిన హీరాలాల్వర్మ గత పదేళ్లుగా మహంకాళి స్ట్రీట్‌లో శ్రీజదాంబ ఇండస్ట్రీస్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు.
గత నెల 25న సాయంత్రం నాలుగున్నరగంటలకు ఆయన రెగ్యులర్ కస్టమర్ రాజేశ్ మరో వ్య క్తితో కలిసి దుకాణానికి వచ్చారు. వారు సుమా రు పది కిలోల బరువున్న మూడు వెండి కడ్డీలను సుమారు అరవైశాతంపైగా స్వచ్ఛత కలిగినవిగా తెచ్చారు. దానికి సంబంధించి దుర్గా బులియన్ రిఫైనరీ ఇచ్చిన ప్యూరిటీ సర్టిఫికేట్‌ను కూడా చూశారు. గతంలో రాజేశ్ పలుమార్లు లావాదేవీలు జరిపి ఉండడంతో ఫిర్యాదుదారుడు వారి ని నమ్మి ఆ మెటీరియల్‌ను పరీక్షించకుండానే దానికి బదులుగా రూ.15లక్షల విలువైన 6.350కిలోల స్వచ్ఛమైన వెండికడ్డీలను వారికి అప్పగించారు. వారు వెళ్లిన తర్వాత ఆ మెటీరియల్‌ను పరీక్షించగా అందులో ఏ మాత్రం వెం డి లేదని తేలింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదే ముఠా మహంకాళి , మార్కెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఇదే తరహాలో మోసాలకు పాల్పడి సుమారు 12.5కిలోల వెం డిని కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈకేసులో ప్రధాన నిందితుడు ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన 59ఏళ్ల ఆర్ఎంపీ డాక్టర్ హృదయేశ్కుమార్తో పాటు రిటైర్డ్ వాటర్ వర్క్స్ ఉద్యోగి సుశీల్కుమార్వర్మ, ఆటోడ్రైవర్ ప్రిన్స్ అలియాస్ లడ్డు సోని, ఇటావాకు చెందిన వ్యాపారి రాజీవ్ జైన్, మధ్యప్రదేశ్ అశోక్‌నగర్‌కు చెందిన సోను కుష్వాహాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఆగ్రా , మధ్యప్రదేశ్‌లలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తరలించారు. నిందితుల నుంచి 8.4కిలోల వెండి, రూ.1.5లక్షల నగదు , నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
రెండుసార్లు అసలు వెండి ఇచ్చి ఆపై …
ఆగ్రాకు చెందిన ఈ ముఠా హైదరాబాద్‌లో ఇతరుల ద్వారా తరచుగా వెండివ్యాపారులను కలుస్తారు. వెండి మార్పిడి వ్యాపారానికి ఒప్పందం కుదుర్చుకుంటారు. రెండుసార్లు 60శాతం స్వచ్ఛతతో ఉన్న వెండిని ఇచ్చి అందు కు అనుగుణంగా వందశాతం స్వచ్ఛతతో కూడిన వెండిని తిరిగి తీసుకుంటారు. ఇలా రెండుసార్లు అసలు వెండిని ఇచ్చి మూడోసారి నకిలీతో మో సం చేస్తారు. ఇలా ముఠాపై గతంలో కూడా హై దరాబాద్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ ముఠా నకిలీ వెండిని ఉత్తరప్రదేశ్‌లో తయారుచేసి నగరానికి తీసుకొస్తారు. రెండుసార్లు నిజమైన వెండిని ఇచ్చి మార్పిడి చేసుకున్న తర్వాత మూడవసారి ఏమాత్రం వెండిలేని కడ్డీలను తెస్తారు. వీటికి నకిలీ ప్యూరిటీ సర్టిఫికేట్లను సృష్టించి వ్యాపారుల నుంచి అసలైన వెండిని తీసుకొని పరారవుతారు.
రాగి, టిన్, కడియంతోపాటు ఇతర రసాయనాలు కలిపి ఈ నకిలీ వెండి తయారు చేస్తున్నారు. ఇలా తయారుచేసిన వెండిని కోసి చూసినా అది అచ్చం వెండిలా గా కనిపిస్తుండడంతో చాలామంది వ్యాపారులు బోల్తాపడుతున్నారని పోలీసులు తెలిపారు. వెండి వ్యాపారులు ప్రతీ లావాదేవీకి ముందు సరుకును ఖచ్చితంగా పరీక్షించుకోవాలని సూ చించారు. కొత్త, రెగ్యులర్ కస్టమర్లపై కూడా పూ ర్తిగా నమ్మకం ఉంచకూడదని హెచ్చరించారు. ఈ ముఠా ఇప్పటికే మధ్యప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో ఇదే తరహాలో నేరాలకు పాల్పడినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. ఆ కేసును విజయవంతంగా ఛేదించిన సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నరసయ్య, మహంకాళి ఏసీపీ శ్రీధర్, ఇన్స్పెక్టర్ రవికుమార్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రంగారెడ్డి, డీఎస్ఐ ప్రసాద్‌రెడ్డి తదితరులను ఉన్నతాధికారులు అభినందించారు.