Borabanda Police Station | వివాదాలకు నిలయంగా బోరబండ పోలీసు స్టేషన్..! రెండేండ్లలో ఐదుగురు ఇన్స్పెక్టర్ల బదిలీ..!!
Borabanda Police Station | వెస్ట్ జోన్ పరిధిలో 2023 జూన్ 2వ తేదీన కొత్తగా బోరబండ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. అంటే.. ఈ పీఎస్ ఏర్పడి రెండేండ్లు కూడా పూర్తి కాలేదు. కానీ ఇప్పటి వరకు ఐదుగురు ఇన్స్పెక్టర్లు మారారు.
Borabanda Police Station | ఎర్రగడ్డ, ఫిబ్రవరి 28 : వెస్ట్ జోన్ పరిధిలో 2023 జూన్ 2వ తేదీన కొత్తగా బోరబండ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. అంటే.. ఈ పీఎస్ ఏర్పడి రెండేండ్లు కూడా పూర్తి కాలేదు. కానీ ఇప్పటి వరకు ఐదుగురు ఇన్స్పెక్టర్లు మారారు.
ఈ పోలీసు స్టేషన్లో తొలి ఇన్స్పెక్టర్గా కామల్ల రవికుమార్ బాధ్యతలు చేపట్టారు. నాలుగున్నర నెలలకే ఇక్కడ్నుంచి బదిలీ అయ్యారు. రవికుమార్ స్థానంలో వచ్చిన సుంకర విజయ్ కేవలం మూడు నెలలు మాత్రమే విధులు నిర్వహించారు. ఆయన కూడా మరో చోటికి బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో వచ్చిన కె ఆదిరెడ్డి ఒక నెల రోజులు మాత్రమే బోరబండ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించారు. బదిలీ వేటు పడటంతో ఆయన కూడా వెళ్లిపోయారు. గతేడాది మార్చి నెలలో ఈ పీఎస్‌కు నాలుగో ఇన్స్పెక్టర్గా సుంకరి వీరశేఖర్ బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా వీరశేఖర్‌ను బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. ఈ క్రమంలో మల్కాపురం సురేందర్ బోరబండ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన బదిలీల వెనుక వివాదాస్పద అంశాలు ప్రధాన కారణమని సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

