ఖైరతాబాద్: యాజమాన్యం నిర్లక్ష్యంతో ఓ హోటల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమాజిగూడలోని పోతుల టవర్స్స్ ఐదో అంతస్తులో ఉన్న శ్రీ కన్య కంఫార్ట్ రెస్టారెంట్లో శుక్రవారం సాయంత్రం వంట గదిలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు.
తక్షణమే అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజిన్తో మంటలను ఆర్పివేశారు. వెంటిలేటర్ వ్యవస్థలో లోపాలతో చిమ్నిలో నుంచి మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కాగా, రెస్టారెంట్ భవనం పక్కనే పెట్రోల్ బంక్, బట్టల షాపులు సైతం ఉండడంతో భారీగా అగ్నిప్రమాదం జరిగి ఉంటే అధిక నష్టం జరిగి ఉండేదని చెబుతున్నారు.