బంజారాహిల్స్,మే 3 : బంజారాహిల్స్ రోడ్ నెం-3 లోని అనూ వైన్స్‌లో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం ఐదున్నర ప్రాంతంలో వైన్‌షాపు షెట్టర్లోనుంచి పొగలు వస్తున్న విషయాన్ని స్థానికులు గుర్తించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు.
సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులతో పాటు స్థానికులు కలిసి షట్టర్ తాళాలు తెరిచి మంటలు ఆర్పారు. షార్ట్ సర్క్యూట్‌తో వైన్‌షాపులో మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కొన్ని మద్యం బాటిళ్లతో పాటు ఫర్నిచర్ దగ్దం కావడంతో నష్టంపై అంచనా వేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.