హైదరాబాద్: సనత్‌నగర్‌లోని రాజరాజేశ్వరి నగర్లో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో రిఫ్రిజిరేటర్ (Refrigerator Blast) పేలిపోయింది. గురువారం ఉదయం రాజరాజేశ్వరి నగర్‌కు చెందిన సత్యనారాయణ నివాసంలో భారీ శబ్ధంతో ఫ్రిజ్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి సామాను పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
సమాచారం అందుకున్న హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.