హైదరాబాద్: హైదరాబాద్లోని మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. గూడ్స్ షెడ్ రోడ్డులో ఉన్న ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలో శనివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాములో నిల్వ ఉంచిన రసాయన విభాగానికి మంటల పాకడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ప్రాంతాంలో పెద్దఎత్తున పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.