Hyderabad | హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్లో అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం ఓ ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో పాటు దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా అలుముకుంది.
అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.