మెహిదీపట్నం ,మే 14ః షార్ట్ సర్క్యూట్ అయి నిప్పురవ్వలు ఎగిసిపడటంతో ఓ ఫర్నీచర్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన గురువారం ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర కలకలం రేగింది. అనుమతులు లేకుం డా నిర్మించిన భవనంలో కొనసాగుతున్న ఈ ఫర్నీచర్ షాప్‌లో మొదటి అంతస్తులోని మొత్తం ఫర్నీచర్ కాలి బూడిద అయ్యింది. మూడో అంతస్తులో ఎనిమిది కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరందరూ అప్రమత్తం అయి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఆసిఫ్‌నగర్ ఇన్స్పెక్టర్ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం ఆసిఫ్‌నగర్ పీఎస్ సమీపంలో ఎంజె క్లాసిక్ ఫర్నీచర్ షాప్ ఉంది. ఈ షాపులోని అక్రమ సెల్లార్లో, మొదటి అంతస్తులో మొత్తం ఫర్నీచర్ ఉం టుంది.
గురువారం మధ్యాహ్నం షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ ఆనంద్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఫైర్ ఇంజన్లు రావడంతో మంటలు త్వరగా అదుపులోకి వచ్చా యి. అనుమతులు లేకుండా నిర్మించిన భవనంలో సెల్లార్‌తో పాటు మొదటి,రెండవ అంతస్తుల్లో ఫర్నీచర్షాప్ను నిర్వహిస్తున్నారు. మూడో అంతస్తులో ఎనిమిది కుటుంబాలు నివసిస్తున్నాయి.మంటలు పైకి వ్యాప్తి చెందకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పైన అంతస్తులో ఉన్న వారు ప్రమాదాన్ని గమనించి అప్రమత్తం కావడంతో ఎవరికీ ఎలాంటి నష్టం కలగలేదు. కేసును ఆసిఫ్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.