Fire Accident | జియాగూడ, మే 15 : హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం 9గంటల ప్రాంతంలో మూడు అంతస్తుల రెసిడెన్సియల్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసి పడడంతో.. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు.
బిల్డింగ్‌లో చిక్కుకున్న వారిని బ్రాండో స్కై లిఫ్ట్ ద్వారా ఫైర్ సిబ్బంది కాపాడారు. రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మొదటి అంతస్తు నుంచి రెండు మూడు అంతస్తులకు భారీగా మంటలు వ్యాపించడంతో నాలుగు ఫైరింజన్ల ద్వారా మంటలను పూర్తిగా అదుపు చేశారు. ఈ భవనంలో ప్లాస్టిక్ గోదాం ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ఫైర్ అధికారులు గుర్తించారు.