హైదరాబాద్ : ముషీరాబాద్(Mushirabad) మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్( Metro station) వద్ద గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్(Transformer)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు, మంటలు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. స్థానికలు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.