Hyderabad | హైదరాబాద్ : అత్తాపూర్లోని స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలో నిల్వ ఉంచిన ఆయిల్ డబ్బాలు, సిలిండర్లు పేలిపోయాయి. పాత వాహనాలు దగ్ధమయ్యాయి. సిలిండర్లు ఒక్కొక్కటి పేలుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.