ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 4 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంబీఏ రెండు, నాలుగో సెమిస్టర్స్ రెగ్యులర్, బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్, మొదటి, మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలను ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవచ్చని నగేష్ తెలిపారు.