ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 18 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్ష తేదీలను మార్చినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల ఆరో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి, మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షా తేఈలను ప్రకటించినట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూడొచ్చని ఆయన సూచించారు.