పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా.. ఫీవర్!

చర్యలు చేపట్టిన ప్రభుత్వం
330 పడకలను ఆక్సిజన్ బెడ్స్‌గా మార్చేందుకు కృషి
ఇప్పటికే 136 పడకలకు ఆక్సిజన్ ఏర్పాటు
కొవిడ్ చికిత్సలూ ప్రారంభం
అంబర్‌పేట, మే 4: నల్లకుంటలోని ఫీవర్ దవాఖానను పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగం గా ఇప్పటికే సంబంధిత రోగులకు చికిత్సలు చేయడం కూడా ఇక్కడ మొదలుపెట్టారు. ప్రధానంగా కొవిడ్ రోగులకు అవసరమైన ఆక్సిజన్ పడకలను సిద్ధం చేస్తున్నారు. దవాఖానలో ఉన్న 330 పడకలను ఆక్సిజన్ పడకలుగా మారుస్తున్నారు. ఇప్పటికే 136 పడకలకు ఆక్సిజన్ సరఫరా ఉంది. ఇందులో 100 పడకలకు త్రీలైన్ ఆక్సిజన్, 36 పడకలకు సింగిల్ లైన్ ఆక్సిజన్ సరఫరా ఉంది. ఇక్కడ 20 ఐసీయూ వెంటిలేటర్లు ఉ న్నాయి. ప్రస్తుతం, దవాఖానలో 6కేఎల్ ఆక్సిజన్ ప్లాం టు ఉంది. దీని ద్వారానే పడకలకు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా అవుతున్నది. దవాఖానలోని 2, 3, 4 వార్డులలో పూర్తిస్థాయి ఆక్సిజన్ పడకలను ఉంచారు.
వారం రోజు ల్లో 7, 8, 1, 6 వార్డుల్లో ఉన్న 200 పడకలను కూడా సింగిల్ లైన్ ఆక్సిజన్ పడకలుగా మారుస్తున్నారు. ఆక్సిజన్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నియమితులైన ఐఏఎస్ అధికారి శివలింగయ్య మంగళవారం దవాఖానను సందర్శించారు. సూపరింటెండెంట్ డా॥ కె.శంకర్‌తో కలిసి ఆక్సిజన్ ట్యాంకును పరిశీలించారు. ప్రస్తుతం ఉ న్న ఆక్సిజన్ పడకలు ఎన్ని? ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని ఏర్పాటు చేయాలి? అనే విషయాలను చర్చించారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ఫీవర్ ద వాఖానను కూడా పూర్తిస్థాయి కరోనా దవాఖానగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వారు చె ప్పారు. ప్రస్తుతం ఇక్కడ కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారని, వారికి కావాల్సిన అన్ని మందులు, టీకాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Fever Hospital
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

