బేగంపేట్ జూలై 14: నిర్బంధాల మధ్య పండుగలు జరపడం సరికాదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఆ యన సికింద్రాబాద్ లోని మహంకాళి ఆల య వద్ద పర్యటించారు. ఆదివారం బోనాల సందర్భంగా అమ్మవారి దర్శన సమయంలో భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులను పలువురు ఎమ్మెల్యే తలసాని దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులు భక్తి శ్రద్ధలతో పండుగలు జరుపుకునేలా స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 2014 నుంచి భక్తులు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యానికి గురికాకుండా ఉత్సవాలను సంతోషంగా జరుపుకునే విధంగా ఏ ర్పాట్లు చేస్తూ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
గంటల తరబడి భక్తులను దర్శనం కోసం వెళ్లకుండా అడ్డుకోవడం, సంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకోవడం పై అసహనం వ్యక్తం చేశారు. అమ్మవారికి తొలిపూజ, హారతిని కూడా సకాలంలో నిర్వహించకపోవడాన్ని తప్పుపట్టా రు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, మహేశ్ యాదవ్, మహేందర్ ఉన్నారు.