బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నం. 86లో ఉంటున్న ఓ వ్యాపారవేత్తకు చెందిన విశ్వ సముద్ర హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో ఉన్న ఫెరా రీ కారులో డ్రైవర్ సతీష్‌తో పాటు మరో యువకుడు ఆదివారం తెల్లవారుజామున ఇంటినుంచి బయలుదేరారు.
ఫిలింనగర్ సైట్-2లోని హిల్ వ్యూ అపార్ట్మెంట్ వద్ద ఓ వాహనం రావడంతో దాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పిన ఫెరారీ కారు హిల్‌వ్యూ అపార్ట్మెంట్ గేటుకు ఢీకొట్టింది. ఫెరారీ కారు నుజ్జునుజ్జయింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాలేదు.