మణికొండ, ఏప్రిల్ 8 : ఎస్ఐ రాత పరీక్షలలో భాగంగా గండిపేటలోని మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాల (ఎంజీఐటీ)లో శనివారం పరీక్ష రాసేందుకు రెండు నెలల పసికందుతో అఖిల అనే అభ్యర్థి వచ్చింది.
పరీక్షకు పాపను అనుమతించకపోవడంతో అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ కన్యాకుమారికి అప్పగించింది. తల్లి పరీక్ష రాసేంత వరకు చెట్టుకింద మహిళా కానిస్టేబుల్ చిన్నారిని ఆడించడం చూసి అందరూ ముగ్ధులయ్యారు. కన్యాకుమారి సేవలను ఉన్నతాధికారులూ కొనియాడారు.