సిటీబ్యూరో, మే 16(నమస్తే తెలంగాణ): ఈనెల 22న ఉప్పల్ వేదికగా జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోరును ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటున్న అభిమానుల ఆతృతను సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో మోసపూరిత వెబ్సైట్ల ద్వారా సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయన్నారు.
అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన డిస్ట్రిక్ట్ యాప్‌ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్‌లను సృష్టించి, తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారని, ఫేక్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త అనీ, మ్యాచ్ చూడాలనే ఉత్సాహంతో సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను నమ్మి మోసపోవద్దని క్రికెట్ అభిమానులకు నగర పోలీసులు సూచిస్తున్నారు. అధికారిక యాప్‌ను పోలిన ఈ లింక్‌లను క్లిక్ చేస్తే అభిమానుల డబ్బులు గల్లంతవడం ఖాయమని, ఇలాంటి ఫేక్ యాప్స్, వెబ్సైట్ల గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.