సిటీబ్యూరో, మార్చి 14(నమస్తే తెలంగాణ): ఎలాంటి వైద్య విద్యార్హతలు లేకుండా డాక్టర్‌గా చలామణి అవుతున్న ఓ నకిలీ వైద్యుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ రష్మీ పెల్మాల్ కథనం ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన రాజు గంగారామ్‌కు ఆయుర్వేద, జనరల్ మెడిసిన్ క్లినిక్‌లలో పనిచేసిన అనుభవం ఉన్నది. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు వైద్యుడి అవతారమెత్తాడు. అంబర్‌పేట పటేల్‌నగర్‌లో శ్రీసాయి వెంకటేశ్వర క్లినిక్ పేరుతో క్లినిక్‌ను ప్రారంభించాడు.
మందులు రాసే లెటర్ ప్యాడ్లపై డాక్టర్ ఏ.రాజు డీఎన్వైఎస్, పీజీడీఈఎంఎస్ (ముంబై) అండ్ ఫ్యామిలీ ఫిజిషియన్ అంటూ రాసుకున్నాడు. అతడి అర్హతలకు తగిన సర్టిఫికెట్లు ఒకటి కూడా లేదు. ఈ విషయం తెలుసుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ బృందం ఈ క్లినిక్‌పై దాడి చేసి, నకిలీ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి క్లినిక్ నుంచి పలు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు.