ఎయిర్‌పోర్టులో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ దుస్తులు ధరించి, ఫొటోలు తీస్తున్న ఓ వ్యక్తిని ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు మంగళవారం ఆరెస్టు చేశారు. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి గతంలో ఓ యవతిని ప్రేమించాడు. కానీకొన్ని కారణాలతో ఇద్దరు వివాహం చేసుకోలేకపోయారు. దీంతో పాటు బాలకృష్ణకు మరో వివాహం జరిగి విడాకులు తీసుకున్నారు.
- ఆరెస్టు చేసి శంషాబాద్ పోలీసులకు అప్పగింత
- కేసు నమోదు.. రిమాండ్‌కు తరలింపు
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 14 : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ దుస్తులు ధరించి, ఫొటోలు తీస్తున్న ఓ వ్యక్తిని ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు మంగళవారం ఆరెస్టు చేశారు. శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి గతంలో ఓ యవతిని ప్రేమించాడు. కానీకొన్ని కారణాలతో ఇద్దరు వివాహం చేసుకోలేకపోయారు. దీంతో పాటు బాలకృష్ణకు మరో వివాహం జరిగి విడాకులు తీసుకున్నారు.
బాలకృష్ణ గతంలో ప్రేమించిన యువతికి సైతం విడాకులు కావడంతో మళ్లీ ఇద్దరూ పరిచయమై పెళ్లిదాక వచ్చారు. కానీ యువతి తల్లిదండ్రులు ప్రభుత్వం ఉద్యోగం ఉంటేనే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పడంతో బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ యూనిఫాం వేసుకొని ఫొటోలు దిగుతూ పెళ్లి చేసుకునే యువతికి పంపించి తనకు సెంట్రల్ డిపార్ట్మెంట్ ఉద్యోగం వచ్చిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అతడిని అధికారులు అరెస్టు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. బాలకృష్ణ ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్లో అమ్మాయిలకు ఇలాగే వల వేస్తాడని గుర్తించిన్నట్లు తెలిపారు. బాలకృష్ణపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన్నట్లు వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
పాలనా వికేంద్రీకరణతో పారిశ్రామిక విప్లవం
వందేండ్ల అభివృద్ధి.. పదేండ్లలోనే.. విశ్వనగరంలో ప్రగతి పతాక రెపరెపలు
బీజేపీ కోసమే ఓట్ల తొలగింపు.. 95 లక్షల ఓట్ల గల్లంతుపై స్వతంత్ర విచారణ చేపట్టాలి : బీఆర్ఎస్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

