సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఎండలు మండుతున్నాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.7 డిగ్రీలు, గాలిలో తేమ 36శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి అధికంగా నమోదవుతుండడంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే మరో రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.