మన్సురాబాద్, మే 14 : అదనపు క ట్నం తేవాలంటూ అత్తవారి ఇంటి నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసం అత్తింటివారే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. మృతురాలి తం డ్రి కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా, నాయుడుపేట, కేబీఆర్ నగర్‌కు చెందిన కట్ట వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. నాలుగేండ్ల కిందట తన కూతురు జాస్మిన్(28)ను పెండెం రాజశేఖర్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. ప్రస్తుతం పెండెం రాజశేఖర్ తన భార్య జాస్మిన్‌తోపాటు కుటుంబ సభ్యులతో కలిసి ఎల్బీనగర్ శివపురికాలనీలో నివాసం ఉంటున్నాడు. కాగా, వివాహం సమయంలో రూ.25లక్షల నగదు, 20 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు.
అయినప్పటికీ పెండెం రాజశేఖర్ కుటుంబసభ్యుల ధన దాహం తీరలేదు. పెళ్లయిన ఆరు నెలల నుంచే అదనపు కట్నం కోసం జాస్మిన్ భర్త పెండెం రాజశేఖర్, మరిది నగేశ్, ఆడబిడ్డ భార్గవి, అత్త సరిత, ఆడబిడ్డ భర్త రాధాకృష్ణ వేధించగారు. అదనపు కట్నం తేవాలంటూ జాస్మిన్ను పలుమార్లు వారి తల్లిదండ్రుల వద్దకు పంపా రు. ఖమ్మంలో జాస్మిన్ తండ్రి పేరిట ఉన్న ఇంటిని రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేశారు. పెండెం రాజశేఖర్ కుటుంబసభ్యుల డిమాండ్లను అంగీకరించకపోవడంతో ఈనెల 13వ తేదీన సాయంత్రం 5:30 గంటల సమయంలో జాస్మిన్ను తీవ్రంగా కొట్టి ఉరివేసి హత్య చేశారని, మృతురాలి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారంటూ పోలీసులకు తెలిపారు. జాస్మిన్ ఒంటిపై గాయా లు ఉన్నాయని, విచారణ జరిపి జాస్మిన్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు మృతురాలి తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.