ఓటేద్దాం..రండి .!
ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం. ఇంటి నుంచి బయటకు రండి.. ఓటు హక్కును వినియోగించుకోండి. మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే భవిత. లేదంటే ఐదేండ్ల పాటు అంధకారమే. నీ సత్తా నిరూపించుకునే సమయం వచ్చినప్పుడు మిన్నకుండి తదనంతరం నిందించే కన్నా.. ముందే మేల్కోండి.
- మనం వేసే ఓటే.. రేపటి మన భవిష్యత్తు..!
- ఇంటి నుంచి బయటకు రండి.. మంచి నాయకుడినిఎన్నుకోండి
- ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి
ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం. ఇంటి నుంచి బయటకు రండి.. ఓటు హక్కును వినియోగించుకోండి. మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే భవిత. లేదంటే ఐదేండ్ల పాటు అంధకారమే. నీ సత్తా నిరూపించుకునే సమయం వచ్చినప్పుడు మిన్నకుండి తదనంతరం నిందించే కన్నా.. ముందే మేల్కోండి. సమాజంలో మార్పుతో కూడిన అభివృద్ధి సాధించాలంటే పౌరులు యుద్ధాలు, త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు.
చేయాల్సిందల్లా ఒక్కటే.. పోలింగ్ రోజు నీకున్న హక్కు సద్వినియోగం చేసుకోవడమే. నీ కర్తవ్యం నెరవేర్చాల్సిన రోజున బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే.. సమాజమే కాదు.. దేశం కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ కొన్ని నిమిషాలు వెచ్చించి పౌరులిచ్చే తీర్పు.. రాబోయే ఐదేళ్ల పాటు జీవన స్థితిగతుల్ని ప్రభావితం చేస్తుంది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు నిరుపయోగం కాకుండా అందరూ సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం ప్రకాశిస్తుంది. ఆ క్షణాలు కొన్ని గంటల్లో మన ముందుకు రాబోతున్నాయి. రాష్ట్ర, దేశ భవిష్యత్తును మార్చే మీ ఓటు వేయడానికి అందరూ కలిసి రండి.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

