మాదాపూర్, జనవరి 20: వృత్తి నైపుణ్య శిక్షణలో ఉత్తమ ప్రతిభ చూపిన న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్) సంస్థకు అసోచామ్ ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డ్డు – 2023 వరించింది.
న్యూ ఢిల్లీలో శనివారం జరిగిన 6వ ఇంటర్నేషనల్ సైస్టెనబిలిటీ కాంక్లేవ్‌లో న్యాక్ డైరెక్టర్లు శాంతి శ్రీ, ఎం. రాజిరెడ్డికి అసోచామ్ ప్రతినిధులు అవార్డును అందజేశారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి, న్యాక్ వైస్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, న్యాక్ డైరెక్టర్ కె. భిక్షపతిని అభినందించారు.