ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 18: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజులను స్వీకరిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఎంపీఈడీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 28వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 30వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు.
బీపీఈడీ, డీపీఈడీ రెండు, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, మూడో సెమిస్టర్ ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 29వ తేదీలోగా, రూ.200 అపరాధ రుసుముతో వచ్చే నెల 1వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని పేర్కొన్నారు. ఎంఈడీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, మూడో సెమిస్టర్ ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును వచ్చే నెల 1వ తేదీలోగా, రూ.200 అపరాధ రుసుముతో 4వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ పరీక్షల విభాగం, కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. అన్ని ఫ్యాకల్టీల పీహెచ్డీ కోర్స్ వర్క్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీ నుంచి, ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలను వచ్చే నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఎం ఫార్మసీ (పీసీఐ) మొదటి, మూడో సెమిస్టర్, బ్యాచ్లర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఎం ఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ రెండు, మూడో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.