
మంత్రి హరీశ్ రావుకు వినతి
రవీంద్రభారతి, జనవరి 30: ఓసీల్లో వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో కేటాయించిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కోరారు. మినిస్టర్స్ క్యార్టర్స్‌లో ఆర్థిక, వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, హోం మంత్రి మహమూద్ అలీని ఆదివారం ఓసీ సామాజిక సంఘాల సభ్యులు కలిసి ఈడబ్ల్యూఎస్ అమలులో ఎదురవుతున్న సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. త్వరలో ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో అవకాశం పొందేందుకు 10 శాతం రిజర్వేషన్లను అమలును కలెక్టరేట్లకు, తహసీల్దార్ పంపాలని కోరారు. రెడ్డి, వైశ్య సామాజిక వర్గాలకు, ఇతర ఓసీ సామాజిక వర్గాల సంక్షేమానికి ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని రామారావు విజ్ఞప్తి చేశారు.
మహాత్మునికి ఘన నివాళి
సిటీబ్యూరో, జనవరి 29(నమస్తే తెలంగాణ)/మెహిదీపట్నం: జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురసరించుకొని ఆదివారం లంగర్ హౌజ్‌లోని బాపూఘాట్‌ను హోంమంత్రి మహమూద్ అలీ సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీజీ సమాధి వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీ కేశవరావు, మేయర్ విజయలక్ష్మి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపినాథ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో జీఏడీ సెక్రెటరీ వికాస్ రాజ్, సెక్రెటరి ప్రొటోకాల్ అరవింద్ సింగ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, హైదరాబాద్ ఆర్డీవో వెంకటేశ్వర్లు, గోలొండ తహసీల్దార్ శైలజ, తదితరులు పాల్గొన్నారు.