సిటీబ్యూరో, డిసెంబరు 6(నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ)లో ప్లెక్సిబుల్, అండ్ రిజిడ్ వేవ్మెంట్స్ డిజైన్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్‌పై ఈనెల 2 నుంచి ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి మొత్తం 36 మంది ఇంజినీర్లు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈఎస్సీఐ డైరెక్టర్ డా.జి.రామేశ్వర్రావు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంజినీర్లతో పలు అంశాలపై చర్చించారు. రోడ్డు నిర్మాణంలో కొత్త సాంకేతికతలను అమలు చేసే ప్రాముఖ్యత, సమాజానికి వాటి వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. తెలంగాణ, ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, బీహార్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, లడఖ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, యూపీ, ఉత్తరాఖండ్ సహా మొత్తం 22 రాష్ర్టాలకు చెందిన ప్రతినిధులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.