హైదరాబాద్ : క్యాంపస్ ప్లేస్మెంట్(Campus placement)లో ఉద్యోగం రాలేదని ఓ విద్యార్థి(Engineering student) బలవన్మరణానికి(Commits suicide) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మైసమ్మగూడలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన మహ్మద్(22) ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కాగా, బుధవారం కాలేజీలో జరిగిన ప్లేస్మెంట్లో తనకు ఉద్యోగం రాలేదని నిరాశతో ఓ వసతి గృహంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహ్మద్ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.