సిటీబ్యూరో, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అర్చకుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వినూత్న చర్యలు చేపట్టారని, గ్రామీణ అర్చకులకు వేతనం ఇవ్వడం తో పాటు ప్రభుత్వపరంగా అండగా ఉండాలన్న ఆయన ఆలోచనల ను దేవాదాయ శాఖ అమలు చేస్తున్నది. అర్చక, ఉద్యోగ సంఘం నాయకులు పేర్కొన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ అనిల్ కుమార్ను ఆయన కార్యాలయంలో శుక్రవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం, తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రాచారి రాష్ట్ర దేవాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కాండూరి కృష్ణమాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ ఈ నెల 28న గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి అన్ని జిల్లాల సహాయ కమిషనర్లు, సంబంధిత ఈఓలు, అర్చక, ఉద్యోగ సంఘాలతో సమావేశమై ప్రభుత్వ జీఓల అమలుపై చర్చించనున్నట్లు కమిషనర్ తెలిపారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ధూప దీప నైవేద్య పథకం అర్చకులతో ఈ నెల 8న కరీంనగర్లో డీడీఎన్ అర్చక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవ శర్మ, ప్రధాన కార్యదర్శి పిండిప్రోలు నాగ దక్షిణామూర్తి శుక్రవారం తెలిపారు.