కలెక్టర్‌కు ఫిర్యాదు.. కదిలిన యంత్రాంగం
ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను పడుతున్నది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి ప్రైవేట్ వెంచర్‌కు రహదారి ఏర్పాటు చేసిన ఘటన మహేశ్వరం మండలంలోని కొంగరకుర్థు-ఏ గ్రామంలో వెలుగు చూసింది.
- ప్రభుత్వ భూమిలో అక్రమ రోడ్డు.. కూల్చివేత
- పది ఎకరాల అసైన్డ్, టీజీఐఐసీ భూమి కబ్జాచేసి వెంచర్‌కు రోడ్డు
- ఐదు జేసీబీలతో రోడ్డును తొలగించిన అధికారులు
- భారీ పోలీసు బందోబస్తు
ఆదిబట్ల, ఆగస్టు 28 : ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను పడుతున్నది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి ప్రైవేట్ వెంచర్‌కు రహదారి ఏర్పాటు చేసిన ఘటన మహేశ్వరం మండలంలోని కొంగరకుర్థు-ఏ గ్రామంలో వెలుగు చూసింది. గ్రామంలోని సర్వే నంబర్ 289లో ఉన్న అసైన్డ్భూమి, టీజీఐఐసీకి సంబంధించిన భూమిలో సుమారు పది ఎకరాలు మేర ఆక్రమణకు పాల్పడి, వెంచర్లోకి వెళ్లేందుకు సుమారు కిలోమీటరు పొడవున అక్రమంగా రోడ్డును ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో శుక్రవారం మహేశ్వరం తహసీల్ధార్చిన్న అప్పలనాయుడు, ఆర్ఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఐదు జేసీబీలను రంగంలోకి దించి ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును పూర్తిగా తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ఫిర్యాదు చేస్తేనే స్పందన..
ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా సంబంధిత అధికారులు ముందస్తుగా గుర్తించి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పనటికీ పట్టించుకోకుండా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. చివరకు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో మహేశ్వరం రెవెన్యూ అధికారులు స్పందించి రోడ్డును తొలగించారని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రైవేట్ వెంచర్‌కు రోడ్డు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికార యంత్రాంగం కబ్జాలు జరిగిన తర్వాత స్పందించడంపై ఉన్నతాధికారుల దృష్టి సారించాలని కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

