మెహిదీపట్నం, ఫిబ్రవరి 24: మీటర్ ట్యాంపరింగ్ విషయంలో విద్యుత్ వినియోగదారుడి నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాలు..మాసాబ్‌ట్యాంక్ సెక్షన్ ఇన్చార్జి ఏఈగా పనిచేస్తున్న మామిడిశెట్టి శ్రీనివాస్‌రావు నాలు గు రోజుల క్రితం పోచమ్మ బస్తీకి చెం దిన ఓ వినియోగదారుడు విద్యుత్ ట్యాంపరింగ్‌కు పాల్పడగా.. రైడ్ చేసి మీటర్‌ను సీజ్ చేశాడు. అయితే బాధితుడిపై మీటర్ ట్యాంపరింగ్ కేసు వేయకుండా ఉండాలంటే 17వేల రూపాయల లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు. బాధితుడు మంగళవారం ఏఈ శ్రీనివాస్‌రావుకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదిలా ఉండగా గతంలో కూడా ఇదే వినియోగదారుడిని మీటర్ ట్యాంపరింగ్ విషయంలో బెదిరించి ఎఈ శ్రీనివాస్ రావు డబ్బులు వసూలు చేశాడని సమాచారం.