సిటీబ్యూరో, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): ఇటీవలి విద్యుత్ ప్రమాదాల్లో అత్యధిక శాతం వినియోగదారులు, కాంట్రాక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే జరిగాయని, ఆఫీసులు, నివాసాల్లో లోడ్‌కు తగినట్లుగా ఎర్తింగ్ ఉంటే ప్రమాదాల తీవ్రత తగ్గుతుందని ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి కె.నందకుమార్ అన్నారు. మంగళవారం మాసబ్‌ట్యాంక్ వద్ద ఉన్న సీఈఐజీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులతో నందకుమార్ సమావేశమయ్యారు.
తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కాంట్రాక్టర్లు వినియోగించాల్సిన సామాగ్రి, పనితీరుపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్లు తాము పనులు చేస్తున్న సమయంలో ఇనుప స్తంభాలు, తెగిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, నిర్లక్ష్యంగా ఉంటే మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారు. నా
ణ్యమైన పరికరాలు వాడడంతో పాటు లైసెన్స్డ్ కాంట్రాక్టర్లతో విద్యుత్ పనులు చేయించుకోవాలని, వినియోగదారుల రక్షణతో పాటు కాంట్రాక్టర్ల భద్రతను పాటిస్తూ పనులు చేయాలని నందకుమార్ చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఈ రాజు, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జీసీ.రెడ్డి, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర సలహాదారు మాజీ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు సభ్యుడు నక్క యాదగిరి, బోర్డు సభ్యులు నేమాల బెనర్జీ, చిన్నపుల్లారావు, రాఘవేంద్రరావు, విజయ్‌పాల్‌రెడ్డి, నర్సింగ్‌రావు, నాగయ్య, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.