సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. 15 మంది సభ్యులతో స్టాండింగ్ కమిటీ ఏర్పడగా.. గత నెల 4న ఎర్రగడ్డ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ షాహీన్ బేగం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు.