కందుకూరు : పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. మండల పరిధిలోని గూడూరు గ్రామంలో నిర్మించిన వెంకేశ్వర స్వామి ఆలయంలో విగ్రహల ప్రతిష్టా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పూజ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ. దేవాలయాలను అన్ని విధాలుగా అబివృద్ధి చేయాలని కోరారు. ప్రతి ఒక్క రూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. అనంతరం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ.తెలంగాణ ప్రభుత్వం పండుగలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
రాష్ట్రం ఏర్పడిన అనంతరం పండుగలకు మరింత గుర్తింపు వచ్చిందని తెలిపారు. అనంతరం నిర్వాహకులు రాంగోపాల్‌రెడ్డి, సర్పంచ్ శ్రీలత, శ్రీహరి, ఎంపీటీసీ ఎల్లారెడ్డిలు వారికి మెమొంటోలను అందచేసి సత్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఆనేగౌని ఆశోక్డౌ, రాంగోపాల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, యాదగిరి, పారిజాతం, సురేందర్ ముదిరాజ్ భక్తులు పాల్గొన్నారు.