కంటోన్మెంట్, ఆగస్టు 30: ఏ విషయంలోనూ దివ్యాంగులు సామాన్యులకు తీసిపోరని, దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ తమవంతు సహాయ సహకారాలను అందించేందుకు ముందుకురావాలని ఈసీఐఎల్ జీఎం(హెచ్ఆర్) ఎ.మాల్వియా అన్నారు. న్యూ బోయిన్పల్లి మనో వికాస్‌నగర్‌లోని జాతీయ మానసిక దివ్యాంగుల సాధికారత సంస్థ (ఎన్ఐఈపీఐడీ)కు సీఎస్ఆర్ ప్రాజెక్టుకింద ఈసీఐఎల్ సోమవారం రూ.20.59లక్షల విలువజేసే స్కూల్ బస్సును విరాళంగా అందజేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల్వియా బస్సుకు సంబంధించిన తాళం చెవిలతోపాటు ధ్రువీకరణ పత్రాలను ఎన్ఐఈపీఐడీ డైరెక్టర్ బీవీ రాంకుమార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈసీఐఎల్ అధికారులు మునికృష్ణ, సీహెచ్ శ్రీనివాస్, డాక్టర్ పి.వేణుబాబు, దుర్గాప్రసాద్, సునీల్‌కుమార్, వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు భాస్కర్‌రెడ్డి, జీవీఆర్వీ ప్రసాద్, ప్రసాద్, రాజ కరుణానిధి తదితరులు పాల్గొన్నారు.